ఏపీ పన్నుల రాబడిలో భారీ వృద్ధి.. ఆగస్టులో 18.05 శాతం పెరిగిన ఆదాయం
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:21 PM
ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర పన్నుల ఆదాయం 18.05 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర పన్నుల ఆదాయం 18.05 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్టులో రూ.21,558.09 కోట్లుగా ఉన్న పన్నుల రాబడి.. ఈ ఏడాది ఆగస్టులో రూ.25,449.80 కోట్లకు చేరింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో పన్నుల రాబడిలో రూ.485.41 కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్నుల రాబడితో పాటు నికర వసూళ్లలోనూ దాదాపు 18 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పన్నుల వసూళ్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.
వాణిజ్య పన్నుల శాఖలో చేపట్టిన సాంకేతిక సంస్కరణలు, ఆధునిక విధానాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పన్ను ఎగవేతలను గుర్తించడం, అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించడం కోసం వాణిజ్య పన్నుల శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్క్రూటినీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News