ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. ఆ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ..
ABN , Publish Date - Feb 16 , 2026 | 08:14 PM
నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం11 గంటలకి ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..
నెల్లూరు, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు మేయర్ విషయంలో అన్యాయం జరుగుతోందంటూ మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆందోళనలు చేపట్టారు. అయితే జయవర్ధన్ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రోత్సాహంతోనే తమపై విషప్రచారం సాగించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రచారాలు చేశారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకేసంఖ్యా బలం అత్యధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని టీడీపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News