కల్తీ పాల ఘటనపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ..
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:04 PM
రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు..
రాజమండ్రి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు. కల్తీ పాలు ఘటనలో నలుగురు మృతి చెందారని, 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు. వీర పాండ్యన్ ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోశారని, పాలు కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. పాలు, పెరుగు, బాధితుల రక్త నమూనాలు సేకరించి లేబరేటరీలకు పంపించినట్లు వివరించారు.
పరీక్షలు నిర్వహించేందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందం తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది ఖర్చులనూ ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారని అన్నారు. పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని తెలిపారు. పాలు తాగిన వారందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను వెంటనే సంప్రదించాలని వీర పాండ్యన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..
Read Latest Telangana News And AP News And Telugu News