Share News

శ్రీకాకుళం రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి పవన్

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:33 PM

నలుగురు విద్యార్థుల మృతికి కారణమైన టెక్కలి రైలు ప్రమాద ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీకాకుళం రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి పవన్
deputy cm pawan on tekkali train accident

అమరావతి, సెప్టెంబర్ 23: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఘటనపై జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఐదుగురు విద్యార్థులు నౌపడ నుంచి టెక్కలి వైపు రైల్వే ట్రాక్‌పై నడిచి వెళ్తుండగా.. భువనేశ్వర్ నుంచి గణపూర్ వైపుకు వెళ్లే రాజారాణి ఎక్స్‌ప్రెస్ వేగంగా వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యా్ర్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు గాయాలతో బయటపడ్డారు. రైలు రాకను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పవన్ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జిలకు శాశ్వత హోదా.. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే

విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన యంత్రాంగం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 09:53 PM