Share News

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఇంకా పొంచివున్న ముప్పు

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:38 PM

రాష్ట్రాన్ని భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తోన్న తీవ్ర వాయుగుండం తీరం దాటింది. నిన్న రాత్రి(బుధవారం) కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఇంకా పొంచివున్న ముప్పు
cyclone has crossed ap coast

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. నిన్న రాత్రి కళింగపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. అయినప్పటికీ ప్రమాదం ఇంకా పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇంకా పొంచివున్న ముప్పు

ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య తీవ్రవాయుగుండం కేంద్రీకృతం అయిందని వాతావరణ నిపుణులు తెలియజేశారు. అయితే.. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న క్రమంలో బలహీనపడుతూ.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్స్‌ జారీ చేసింది.


చేపట వేటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

ఈ రోజు (గురువారం)శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపు(శుక్రవారం)అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు రానున్న మూడు రోజులపాటు.. మత్య్సకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది. ఏపీలోని అన్నీ ప్రధాన పోర్ట్స్‌ల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే విశాఖలోని వాల్తేర్‌లో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ మద్యం రవాణా స్కాం.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 05:40 PM