తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?
ABN , Publish Date - Mar 02 , 2026 | 07:47 AM
తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ రాస్తారోకోకి దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి.
తిరుపతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ(సోమవారం) రాస్తారోకోకి (Tirupati Walkers Protest) దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అయితే, వాకర్స్ తీరుపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి రోడ్డులోని దివ్యరామంలో వాకింగ్ చేసేవారు నెలకు రూ.100లు కట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ప్రవేశ రుసుము చెల్లించిన వారిని అనుమతిస్తూ, చెల్లించని వారిని దివ్యరామంలోని నగరవనానికి వాకర్స్‌ను ఆ శాఖ అధికారులు అనుమతించలేదు.
ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి వాకర్స్ ఆందోళన చేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు ఆగిపోయాయి. తిరుమలకు రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బందిగా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎఫ్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాకర్స్ రాస్తారోకో కొనసాగించారు. ఈ రాస్తారోకోకు వాకర్స్‌లోని సీపీఎం నేతలు నాయకత్వం వహించారు. అయితే.. విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ రామకిశోర్ రంగంలోకి దిగారు. వాకర్స్‌తో ఆయన చర్చించిన అనంతరం రాస్తారోకో విరమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News