శ్రీకాళహస్తిలో టీడీపీ హవా.. మూడు మండలాల్లో కూటమి ఘన విజయం
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:15 PM
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం చాటుకుంది.
తిరుపతి, నవంబర్ 7: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం చాటుకుంది. రేణిగుంట మండలంలో మొత్తం 21 స్థానాలకు గాను 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో టీడీపీ 3, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.
అలాగే ఏర్పేడు మండలంలో మొత్తం 16 స్థానాలకు గాను 15 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఒక్క స్థానంలో ఎన్నిక జరుగగా.. టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక తొట్టంబేడు మండలంలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. వాటిలో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన మరో ఆరు స్థానాల్లో టీడీపీ 4, బీజేపీ ఒకటి, వైసీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మూడు మండలాల్లోనూ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో కూటమి శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం
ఏపీ పెట్టుబడులకు గ్లోబల్ వేదిక.. విశాఖ సీఐఐ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్
Read Latest AP News And Telugu News