Share News

డిఫెన్స్ మద్యం అక్రమ దందాలో భార్యాభర్తలు.. ఆల్వాల్‌లో గుట్టురట్టు

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:22 PM

హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాజీ సైనికుల కోటా మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

డిఫెన్స్ మద్యం అక్రమ దందాలో భార్యాభర్తలు.. ఆల్వాల్‌లో గుట్టురట్టు
Hyderabad Defence Liquor

హైదరాబాద్, నవంబర్ 7: నగరంలోని ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాజీ సైనికుల కోటా మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈరోజు(శనివారం) ఆల్వాల్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రెండు కేసుల్లో మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.2.11 లక్షలు ఉంటుందని అంచనా.


మొదటి కేసులో సరస్వతీనగర్ లోతుకుంటలో మన్యం నాగప్రసన్న, రామాంజనేయులు ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాలపై సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఇంట్లో నుంచి దాదాపు 96 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. భర్త రామాంజనేయులు డిఫెన్స్ క్యాంటీన్ నుంచి మద్యం తీసుకొస్తుండగా.. వాటిని భార్య నాగప్రసన్న విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. భార్య నాగప్రసన్నను అరెస్ట్ చేసి.. భార్యాభర్తలిద్దరిపైనా కేసు నమోదు చేశారు.


రెండో కేసులో న్యూ బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించింది. ముసిమి లెంక(39) అనే మహిళ ఇంట్లో తనిఖీలు చేపట్టగా... 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మద్యం అక్రమంగా విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో నిందితులను ఆల్వాల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అధికారులు అప్పగించారు. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు.. డిఫెన్స్ కోటా మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం

భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్.. అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:58 PM