Share News

భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్.. అరెస్ట్

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:02 PM

భార్యను అతికిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్‌ను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రోహిత్ రాజు మీడియాకు వెల్లడించారు.

భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్.. అరెస్ట్
Bhadradri Kothagudem News

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7: భార్యను అతికిరాతకంగా హత్య చేసిన ఏఆర్ కానిస్టేబుల్‌ను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రోహిత్ రాజు ఈరోజు(శనివారం) మీడియాకు వెల్లడించారు. కొత్తగూడెం ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఏఆర్ కానిస్టేబుల్ బొడా నరేందర్ ఈనెల 3న భార్య భావానిని హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆపై మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసినట్లు చెప్పారు. అతడు ఉంటున్న అద్దె ఇంట్లో భార్య గొంతును చున్నీతో బిగించి చంపేశారని అన్నారు. తండ్రి బొడా హరిలాల్ సహాయంతో ద్విచక్ర వాహనంపై డెడ్‌బాడీని తీసుకెళ్లి భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదావరిలో పడేసినట్లు వెల్లడించారు.


మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయినట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. గోదావరిలో భవాని మృతదేహాన్ని గుర్తించి శవ పరీక్ష నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అలాగే నిందితుడు నరేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి తండ్రి బొడా హరిలాల్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 03:03 PM