వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:26 PM
వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పాకాల సరస్సులో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వరంగల్, నవంబర్ 7: జిల్లాలోని ఖానాపురం మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పాకాల సరస్సులో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరస్సులో ముగ్గురు దూకినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించేలోపే ముగ్గురూ మృత్యువాత పడినట్లు సమాచారం. అనంతరం స్థానికులు సరస్సులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో ఖానాపురం మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులు ఎవరనే విషయంపై ఆరా తీస్తూ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సమస్యలా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేం
అత్తాపూర్‌లో బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఒకరికి తీవ్ర గాయాలు
Read Latest Telangana News And Telugu News