అనకాపల్లి జిల్లాలో కూటమి హవా.. వైసీపీ కంచుకోట బద్దలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 02:40 PM
అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలంలో రాజకీయ చరిత్రను అధికారిక కూటమి తిరగరాసింది.
అనకాపల్లి జిల్లా, నవంబర్ 7: అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలంలో రాజకీయ చరిత్రను అధికారిక కూటమి తిరగరాసింది. దశాబ్దాల నుంచీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న కోటవురట్ల మండలంలో MPTC- 15 సెగ్మెంట్లలో కూటమి విజయ బావుటా ఎగురవేసింది. ఇక్కడ టీడీపీ ఏకంగా 14 స్థానాలు దక్కించుకోగా, జనసేన 1 స్థానం గెలుచుకుంది. వైసీపీ ఒక స్థానాకి పరిమితమైంది. దీంతో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
కాగా ఈనెల 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు ఈరోజు(శనివారం) కౌంటింగ్ జరుగుతోంది. మొదట బ్యాలెట్ బాక్స్‌ల లెక్కింపు జరుగగా... అత్యధికంగా కూటమి పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా.. రాత్రి 8 గంటలలోపు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలూ చదవండి
ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్
జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం