ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:15 PM
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారు. ఉదయం బ్యాలెట్ బాక్స్‌ల లెక్కింపులోనూ కూటమి హవా కొనసాగింది.
అమరావతి, నవంబర్ 7: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారు. ఉదయం బ్యాలెట్ బాక్స్‌ల లెక్కింపులోనూ కూటమి హవా కొనసాగింది. బ్యాలెట్ బ్యాక్స్‌ల లెక్కింపు పూర్తైన వెంటనే ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మెజార్టీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించగా.. అనేక చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ బోణీ కొట్టింది. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి మాచర్ల కల్పన 560 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మేకపాటి కుటుంబానికి షాక్
నెల్లూరు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. సొంతూరైన బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. అలాగే నెల్లూరు రూరల్ జడ్పీటీసీలోనూ టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా.. ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
అనంతపురంలో టీడీపీ హవా
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో టీడీపీ హవా కొనసాగుతోంది. ఆరు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 6 చోట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
విజేతల వివరాలు:
చాపరి - టీడీపీ అభ్యర్థి విజయం
ముద్దినాయనిపల్లి-టీడీపీ అభ్యర్థి విజయం
గోళ్ల - టీడీపీ అభ్యర్థి విజయం
బోరంపల్లి - టీడీపీ అభ్యర్థి విజయం
మానిరేవు - టీడీపీ అభ్యర్థి విజయం
దురదకుంట - టీడీపీ అభ్యర్థి విజయం
మార్కాపురం:
మార్కాపురం మండలం నికరంపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బొమ్మన బోయిన గంగమ్మ గెలుపు.
తర్లుపాడు మండలం కేతగుడిపి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి షేక్ మహబూబ్ బాషా విజయం.
మార్కాపురం మండలం వేములకోట ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మాదిరెడ్డి భారతి 32 ఓట్ల మెజారిటీతో విజయం.
పుల్లలచెరువు మండలం మర్రివేముల ఎంపీటీసీ స్థానంలో 1443 టీడీపీ అభ్యర్థి గెలుపు.
పుల్లలచెరువు 2లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి 250 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థిపై గెలుపు.
మార్కాపురం మండలం చింతగుంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఏరువ రామిరెడ్డి 127 ఓట్లతో విజయం.
పొదిలి మండలం మల్లవరంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 1451 ఓట్లతో విజయం.
త్రిపురాంతకం మండలం గణపవరం ఎంపీటీసీ స్థానం లో 38 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు.
దోర్నాల మండలం బొమ్మలాపురం -2 MPTCలో వైసీపీ అభ్యర్థిపై 981 ఓట్లతో టీడీపీ అభ్యర్థి కుడుముల అంకమ్మ విజయం.
కూటమి క్లీన్ స్వీప్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 75 ఎంపీటీసీ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అభ్యర్థులు 69 స్థానాల్లో గెలుపొందగా.. జనసేన-3, బీజేపీ -2, సీపీఎం -1 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
టీడీపీ అభ్యర్థుల గెలుపు
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మన్నే మరియమ్మ విజయం సాధించారు. టీడీపీకి 639 ఓట్లు పోలవగా.. వైసీపీకి 477 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి మరియమ్మ 102 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ రామవరప్పాడు 6 ఎంపీటీసీలను కూటమి కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే పోలాకి మండలం కొత్తరేవు ఎంపీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 517 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్: కలెక్టర్
ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం.. జడ్పీటీసీలో 206, ఎంపీటీసీలో 2,888 స్థానాల్లో లీడ్
Read Latest AP News And Telugu News