Share News

అనంతపురం, కర్నూలు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

ABN , Publish Date - Nov 07 , 2026 | 09:39 AM

అనంతపురం, కర్నూలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ ఏజెంట్లుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండకూడదంటూ.. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అనంతపురం, కర్నూలు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి
counting centre clashes

అనంతపురం, నవంబర్ 7: అనంతపురం, కర్నూల్ జిల్లాలోని ఆలూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు, రాజకీయనాయకులు ఉండడం వల్ల.. కౌంటింగ్ పారదర్శకంగా కొనసాగదని పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లాలోని అనంతపురం కౌంటింగ్ హాల్ దగ్గర పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఉండడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే ఆత్మకూరులో జెడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో.. తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నయనతరెడ్డి కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండడం ఏంటని పలువురు రాజకీయ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. వీరు కౌంటింగ్ హాల్‌లో ఉంటే.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ.. ఎమ్మెల్యే పరిటాల సునీత.. ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించగా.. ఇరువర్గాల వారు పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 10:16 AM