పుంగనూరును శ్మశానంగా మార్చాలని పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర చేస్తోంది: ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:37 PM
పుంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి కుటుంబం శ్మశానంగా మార్చాలని కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పుంగనూరులో ఎప్పుడూ ఇలాంటి ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు.
అమరావతి, అక్టోబర్ 16: పుంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి కుటుంబం శ్మశానంగా మార్చాలని కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పుంగనూరులో ఎప్పుడూ ఇలాంటి ఘర్షణలు, గొడవలు జరగలేదని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు హింసతో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి కుటుంబం, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే పద్ధతిని కొనసాగిస్తోందని ఆరోపించారు.
గత ఎన్నికల్లోనూ పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం హింసాత్మక రాజకీయాలకు పాల్పడ్డిందని, 2005 నాటిలాగే ఇప్పుడు కూడా బయటి నుంచి మనుషులను తీసుకువచ్చి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో సుమారు 700 మందిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపి, ఆస్తులు ధ్వంసం చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తలు భయపడలేదని అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటో అస్సలు తెలియవని దుయ్యబట్టారు.
నేడు కూడా హింసా వాతావరణాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ఆ కుటుంబం కుట్రలు పన్నుతోందని, ఇలాంటి అరాచక శక్తులను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పుంగనూరు దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం