Share News

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నాకాబందీ.. అదుపులో 48 మంది: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:32 PM

నగరంలో గత అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరిట పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ శుక్రవారం హైదరాబాద్‌లో తెలిపారు. దాదాపు 100కుపైగా బృందాలతో ప్రత్యేక నాకాబందీ నిర్వహించామని చెప్పారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నాకాబందీ.. అదుపులో 48 మంది: సీపీ సజ్జనార్

హైదరాబాద్, అక్టోబర్16: నగరంలో గత అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరిట పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ శుక్రవారం హైదరాబాద్‌లో తెలిపారు. దాదాపు 100కుపైగా బృందాలతో ప్రత్యేక నాకాబందీ నిర్వహించామని చెప్పారు. 3 వేల మంది పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 725 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.


ఈ ఆపరేషన్ కవచ్‌లో 5 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇక ఈ తనిఖీల్లో ఓ ఆయుధం స్వాధీనం చేసుకోగా.. రెండు గంజాయి కేసులు నమోదు చేశామని చెప్పారు. అయితే ఈ తనిఖీల్లో అత్యధికంగా గోల్కొండ జోన్‌లో సరైన పత్రాలు లేని 213 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జూబ్లీహిల్స్ జోన్‌లో 18 వాహనాలు డిటైన్.. 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


నంబర్ ప్లేట్లు తారుమారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. నంబర్ ప్లేట్లను స్పష్టంగా ఉంచుకోవాలంటూ వాహనదారులకు నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పుంగనూరు దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం

For More TG News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 05:38 PM