Share News

రాహుల్‌ గాంధీ దాదాగిరి చేస్తున్నారా?.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:23 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ దాదాగిరి చేస్తున్నారా?.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
Kishan Reddy

హైదరాబాద్, అక్టోబర్ 16: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశంలో దాదాగిరి చేస్తున్నారా అని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వదిలిపెట్టబోమని రాహుల్‌ అనడం సరికాదన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.


దేశంలో ఓట్‌ చోరీ జరగలేదని, చోరులకు ప్రజలు ఎప్పుడూ ఓటు వేయరని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 'సర్(SIR)'తో సంబంధం లేకుండానే గతంలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ ధోవల్‌ను రాజకీయాల్లోకి లాగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ యువత హృదయాల్లో ధోవల్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన పేరు చెబితేనే పాకిస్థాన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతాయని ఆయన తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం గొప్ప వ్యక్తులను వివాదాల్లోకి లాగడం కాంగ్రెస్ పార్టీకి తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’: ఏపీ డీజీపీ

Updated Date - Oct 16 , 2026 | 05:24 PM