Share News

యాదాద్రిలో ఘోర ప్రమాదం.. సిలిండర్లు పేలి కార్మికుడి మృతి

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:31 PM

యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దండుమల్కాపురం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు..

యాదాద్రిలో ఘోర ప్రమాదం.. సిలిండర్లు పేలి కార్మికుడి మృతి
Yadadri Industrial Accident

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. దండుమల్కాపురం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.

పేలుడు ధాటికి అక్కడి పరిస్థితి ఒక్కసారిగా భీతావహంగా మారింది. ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పారిశ్రామికవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన కార్మికుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


సిలిండర్ల పేలుడుతో కలకలం.. ప్రమాదానికి కారణాలపై ఆరా..

పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు.. సిలిండర్లు పేలడానికి సాంకేతిక లోపం కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Updated Date - Oct 16 , 2026 | 04:35 PM