భార్య కాపురానికి రాలేదని.. కత్తితో వేలు కోసుకున్న భర్త
ABN , Publish Date - Aug 30 , 2026 | 09:54 PM
భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ భర్త తన చేతి బొటనవేలును కత్తితో కోసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చిత్తూరు జిల్లా , ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ భర్త తన చేతి బొటనవేలును కత్తితో కోసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రామకుప్పం మండలం గాంధీనగర్‌కు చెందిన మంజునాథ్‌కు భార్య సరితతో కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో సుమారు 10 రోజుల క్రితం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి కాపురానికి తీసుకురావాలని భావించిన మంజునాథ్ ఆమె పుట్టింటికి వెళ్లి సరితను తనతో రావాలని కోరాడు. అయితే ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో మంజునాథ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మంజునాథ్.. భార్య పుట్టింటి ఎదుటే తన చేతి బొటనవేలును కత్తితో గాయపరుచుకున్నాడని స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించి మంజునాథ్‌కు వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News