Share News

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:53 PM

పలమనేరు మార్కెట్‌లో క్యాలీఫ్లవర్‌ ధరలు దారుణంగా పడిపోయాయి. 12 నుంచి 15 క్యాలీఫ్లవర్లు ఉన్న సంచి ధర రూ.60కి దిగిపోయింది.

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

పలమనేరు(తిరుపతి): పలమనేరు మార్కెట్‌లో క్యాలీఫ్లవర్‌ ధరలు దారుణంగా పడిపోయాయి. 12 నుంచి 15 క్యాలీఫ్లవర్లు ఉన్న సంచి ధర రూ.60కి దిగిపోయింది. ఒక క్యాలీఫ్లవర్‌ ధర రూ.5లోపే పలుకుతోంది. సంప్రదాయ పంటలకు స్వస్తిపలికి పరిమిత నీటితో సాగయ్యే కూరగాయలు ఎంచుకున్న రైతులకు ఈ ధర నిరాశ కలిగిస్తోంది. మూడు నెలలకే పంట చేతికొస్తుందనే ఆశతో ఎక్కువ మంది ఈ పంట సాగుచేశారు. వాస్తవానికి మిగిలిన కాయగూరలతో పోలిస్తే క్యాలీఫ్లవర్‌కు పెట్టుబడి వ్యయం ఎక్కువే. సంప్రదాయ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను వినియోగించాలి.


zzzzzzz.jpgక్రిమిసంహారక మందుల ఖర్చూ అధికమే. వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేస్తే ఇప్పుడు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం నుంచి క్యాలీఫ్లవర్ల బస్తా మార్కెట్‌కు తరలించాలంటే సగటున రూ.15 అవుతోందని, 10 శాతం బస్తాకు రూ.6 కమీషన్‌ చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఒక సంచి మార్కెట్‌లో రూ.60కి విక్రయిస్తే తమకు కేవలం రూ.26 మిగులుతోందని నిట్టూర్చుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 12:53 PM