Share News

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:51 PM

అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
APSRTC Bus Overturns

అన్నమయ్య జిల్లా, సెప్టెంబరు 22: అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. విఠలం గ్రామ సమీపంలో బస్సు టైరు పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


మదనపల్లె ఆర్టీసీ డిపో బస్సు మంగళవారం ఉదయం తిరుపతికి బయలుదేరింది. మదనపల్లె-తిరుపతి హైవే మీద ప్రయాణిస్తుండగా.. విఠలం సమీపంలో టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది ప్రయాణికులను స్థానికులు వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైనవారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రి తీసుకువెళ్లారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.


ఇవీ చదవండి

తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

తిరుమల నడకమార్గంలో చెట్టుపై చిరుత..

Updated Date - Sep 22 , 2026 | 02:17 PM