Share News

టమోటా కిలో రూ.27, చీనీ కాయలు టన్ను రూ.15వేలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:40 PM

అనంతపురంలోని కక్కలపల్లి క్రాస్‌లోగల టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠ ధర రూ.27తో విక్రయాలు జరిగినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మల్లిక తెలిపారు.

టమోటా కిలో రూ.27, చీనీ కాయలు టన్ను రూ.15వేలు
Anantapur tomato price, tomato

అనంతపురం: అనంతపురంలోని కక్కలపల్లి క్రాస్‌లోగల టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠ ధర రూ.27తో విక్రయాలు జరిగినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మల్లిక తెలిపారు. మార్కెట్‌లో సరాసరి ధర రూ.24, కనిష్ఠ ధర రూ.17తో విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. మార్కెట్‌కు మొత్తంగా 1200 టన్నుల కాయలు వచ్చాయని వివరించారు.


చీనీ కాయలు టన్ను రూ.15వేలు

అనంతపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో చీనీ కాయలు టన్ను రూ.15వేలతో విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణికార్యదర్శి గోవిందు తెలిపారు. మంగళవారం మార్కెట్‌కు 20 టన్నుల కాయలు వచ్చినట్లు వివరించారు. సరాసరి ధర రూ.11,500, కనిష్ఠ ధర రూ.8వేలతో అమ్ముడుపోయినట్లు ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది.. అంతరాయాలు లేకుండా చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 01:40 PM