బస్సు నడుపుతుండగా గుండెపోటు.. 40 మందిని కాపాడిన డ్రైవర్
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:09 PM
తన ప్రాణాలు పోతున్నా.. లెక్కచేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడి.. ఉద్యోగం, సమాజశ్రేయస్సు పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించారు ఓ ఆర్టీసీ డ్రైవర్. గుండెనొప్పితో డ్రైవింగ్ చేస్తూ.. రోడ్డు పక్కన సురక్షిత ప్రాంతంలో బస్సు నిలిపి చివరకు ప్రాణాలు కోల్పోయారు.
అనకాపల్లి జిల్లా, అక్టోబర్ 8: తన ప్రాణాలు పోతున్నా.. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు ఓ ఆర్టీసీ డ్రైవర్. డ్రైవింగ్ చేస్తుండగా గుండెనొప్పి రావడంతో.. నొప్పిని భరిస్తూ.. బస్సును సురక్షిత ప్రాంతంలో నిలిపి.. చివరకు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు తుని వద్దకు చేరుకోగానే.. డ్రైవర్‌కు గుండెనొప్పి వచ్చింది. అయినా సరే ఆ డ్రైవర్ నొప్పిని భరిస్తూ.. డ్రైవింగ్ మీద పట్టుకోల్పోకుండా నక్కపల్లి వరకూ బస్సును నడిపారు. నక్కపల్లి చేరకోగానే.. నొప్పి తీవ్రతరం కావడంతో నొప్పిని తాళలేక రోడ్డు పక్కన సురక్షిత ప్రాంతంలో బస్సును నిలిపారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు.. డ్రైవర్‌కు సీపీఆర్ చేసి నక్కపల్లిలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News