Share News

ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. పలు చోట్ల కూటమి ఆధిక్యం

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:49 AM

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతున్న వేళ పలు మున్సిపాలిటీల్లో ‘కూటమి’ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ మేరకు తుది ఫలితాల కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. పలు చోట్ల కూటమి ఆధిక్యం
ap municipal election counting

అమరావతి, నవంబర్ 3: నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ‘కూటమి’ దూసుకుపోతోంది.


అమలాపురం, తుని మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్‌లో జనసేన ముందంజలో కొనసాగుతుండగా.. జగ్గయ్యపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీ, చిత్తూరు, విశాఖ కార్పొరేషన్ల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్‌లో ఉంది. దానితోపాటు ధర్మవరం, వెంకటగిరి, పెనుకొండ మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ మిగతా పార్టీలను వెనుకకునెట్టి ముందంజలో కొనసాగుతోంది. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆధిక్యాన్ని కనబరుస్తుండగా.. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాతబస్తీలో యువకుడి హత్య.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

6, 7 తేదీల్లో చర్లపల్లి-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు

For More AP News and Telugu News

Updated Date - Nov 03 , 2026 | 10:52 AM