Share News

స్వగ్రామంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:35 PM

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని తన స్వగ్రామమైన సబ్బవరంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బంది సేవలను కొనియాడారు.

స్వగ్రామంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత
home minister anitha at anakapalli

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 27: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని తన స్వగ్రామమైన సబ్బవరంలో ఫైర్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక కేంద్ర ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆమె వెంట పెందుర్తి ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఉన్నారు.


ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఫైర్ సిబ్బంది సేవలను కొనియాడారు. విపత్తు సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వారి త్యాగానికి, నిబద్ధతకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. బుడమేరు విపత్తు సమయంలో ఫైర్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పరిసరాలను శుభ్రం చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. 15వ ఆర్థికసంఘం నిధులైన 1.60 కోట్ల రూపాయలతో సబ్బవరంలో అగ్నిమాపక కేంద్రభవనాన్ని నిర్మించామని తెలిపారు. ఎన్‌డీఏ కూటమి పాలనలో రాష్ట్రంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించినట్లు ఆమె అన్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో వాహనాలను కొనుగోలు చేశామని వెల్లడించారు.


సొంతూరుకు రావడం చాలా సంతోషం ఉంది: అనిత

‘సొంతూరుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తాతగారి పేరుమీద సొంతూరులో ఒక కళ్యాణ మండపాన్ని కట్టించాలని మా నాన్న గారు నాతో అన్నారు. ఆయన కోరిక మేరకు త్వరలోనే సబ్బవరంలో ఒక కల్యాణ మండపాన్ని నిర్మిస్తాను’ అని అన్నారు. అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలో ఆమె పర్యటించారు. పెందుర్తి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటాలని మంత్రి అభ్యర్థులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ

For More TG News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 01:30 PM