Share News

గోదావరి నదిలో పెరుగుతోన్న నీటిపరిమాణం.. హెచ్చరికల జారీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 08:25 PM

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నదిలో నీటిపరిమాణం స్వల్పంగా పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు గోదావరి నది పరివాహక ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోదావరి నదిలో పెరుగుతోన్న నీటిపరిమాణం.. హెచ్చరికల జారీ
disaster management md flodd alerts ap

అమరావతి, సెప్టెంబర్ 26: ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నదిలో నీటిపరిమాణం స్వల్పంగా పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర రీతిలో ప్రయాణాలు చెయ్యొద్దన్నారు. నదిలో స్నానానికి, ఈతకు, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.


శనివారం సాయంత్రం 6 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 29 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 13.6 మీటర్లు, పోలవరం వద్ద 9.31 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద సుమారుగా 8-9 లక్షల క్యూసెక్కులు వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలైన తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సేవలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు.


మరోవైపు ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 09:44 PM