ఏపీలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:49 PM
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అమరావతి, అక్టోబర్ 15: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దానితో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు చెదురుమదురుగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
Read Latest Telangana News And Telugu News