Share News

ఏపీ ఐఏఎస్ అధికారుల బదిలీలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలపై నిషేధాన్ని పొడిగిస్తూ జీవో జారీ చేసింది.

ఏపీ ఐఏఎస్ అధికారుల బదిలీలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం
ap ias transfers ban extended

అమరావతి, అక్టోబర్ 12: రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులపై నిషేధాన్ని పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 16 వరకు బదిలీలను నిషేధిస్తూ జీవో జారీ చేసింది.


రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలను తాత్కాలికంగా నిలివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితా సవరణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాను సవరించే పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయని.. ఈ సమయంలో ఐఏఎస్‌లను బదిలీ చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికల అనంతరం ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులు అమల్లోకి రానున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్.. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో ఎంఓయూ

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 08:35 PM