రాప్తాడు కేసు నిందితుడు హేమంత్ డిశ్చార్జ్.. రెడ్డిపల్లి జైలుకు తరలింపు
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:11 PM
రాప్తాడు కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్యం పూర్తిగా మెరుగవడంతో.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ రోజు (బుధవారం) హేమంత్‌ను డిశ్చార్జ్ చేశారు. కాగా.. పోలీసులు నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా రెడ్డిపల్లి జైలుకు తరలించారు.
అనంతపురం, నవంబర్ 18: రాప్తాడు కేసులో నిందితుడు హేమంత్ పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. అతడిని డిశ్చార్జ్ చేశారు. కాగా.. పోలీసులు నిందితుడిని ఆసుపత్రి నుంచి నేరుగా రెడ్డిపల్లి జైలులకు తరలించారు.
రాప్తాడు కేసులో నిందితుడు హేమంత్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కార్డియాలజీ ఐసీయూలో మెరుగైన వైద్యం అందించిన మేరకు.. నిందితుడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడి ఆరోగ్యంపై వైద్యుల నివేదికను పోలీసులు అనంతపురం న్యాయమూర్తికి సమర్పించారు. అనంతరం.. కర్నూలు ఆసుపత్రి నుంచి నిందితుడిని పోలీసులు నేరుగా రెడ్డిపల్లి జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఏపీ సెమీకండక్టర్ పాలసీకి ఆమోదం.. ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ
Read Latest AP News And Telugu News