రాప్తాడు బాధితురాలి ఆరోగ్యంలో మెరుగుదల: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:02 PM
రాప్తాడు బాధితురాలి ఆరోగ్యపరిస్థితిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతోందని తెలిపారు.
అమరావతి, నవంబర్ 14: రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ‘బాధితురాలి రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతోంది. హీమోగ్లోబిన్ స్థాయి 9.5కు చేరింది. గతంలో 174గా ఉన్న సీఆర్‌పీ స్థాయి ప్రస్తుతం 46. 38కు చేరింది. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఆక్సిజన్‌ను తీసుకుంటోంది. వైద్యుల సహాయతో నెమ్మదిగా నడుస్తోంది. నొప్పి, ఆందోళనను తగ్గించేందుకు వైద్యులు మందులతో పాటు ఫిజియోథెరపీని కూడా చేయిస్తున్నారు’ అని మంత్రి సత్యకుమార్ బాలిక ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్