అవును.. పెనుకొండ మా జాగీరే..
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:05 PM
‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు.
మంత్రి సవిత
పెనుకొండ(అనంతపురం): ‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, ‘పెనుకొండ నీ అబ్బ జాగీరా?’ అని బహిరంగ సభలో ప్రశ్నించారని అన్నారు. ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పెనుకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు.
పెనుకొండకు సేవచేసే భాగ్యాన్ని సీఎం చంద్రబాబు తనకు ఇచ్చారని, అభివృద్ధిలో తన తండ్రిబాటలో దూసుకుపోతున్నానని అన్నారు. కాబట్టి పెనుకొండ తన జాగీరేనని అన్నారు. నియోజకవర్గంలోని సీఎం సహాయనిధి లబ్ధిదారులకు ఆమె చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో 1306 మందికి రూ.13.45 కోట్లు సీఎం సహాయనిధి చెక్కులు ఇచ్చానని తెలిపారు. తాజాగా 121 మందికి రూ.1.15 కోట్లు మంజూరుకావడంతో లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చానని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు..
టమోటాను చుట్టుముట్టిన చీడపీడలు
Read Latest AP News And Telangana