వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్.. త్వరలో ట్రేడ్ డీల్: అమెరికా విదేశాంగ మంత్రి
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:43 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. ట్రంప్ భారత్ పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని, ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు వచ్చి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తానని తెలిపారు (Donald Trump India Visit).
భారత్-అమెరికా బంధం ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని మార్కో రుబియో పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుబియో మాట్లాడారు. 'వచ్చే ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్, భారత్ పర్యటనకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మా లక్ష్యం' అని చెప్పారు. అలాగే, అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తోందని వ్యాఖ్యానించారు (Trump India Tour).
అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని కూడా రుబియో తెలిపారు (India US Relations). ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే క్వాడ్ దేశాల నేతల సమావేశం కూడా త్వరలో నిర్వహించాలని అమెరికా ఎదురుచూస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..