Share News

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:11 AM

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కనున్న రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..
Donald Trump Avenue

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కనున్న రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 'ఈ విధంగా గౌరవం పొందిన అమెరికా తొలి అధ్యక్షుడిని నేను. ధన్యవాదాలు భారత్' అంటూ ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్'లో పోస్టు చేశారు (Donald Trump Avenue).


అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ పక్కన ఉన్న రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేశారు. ఆ ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆవిష్కరించారు (Hyderabad Donald Trump).


అమెరికాకు చెందిన కీలక టెక్ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్‌లు ఈ రోడ్డుకు దగ్గర్లోనే ఉన్నాయి (US Consulate Hyderabad). ఈ పేరు మార్పును తెలంగాణ ప్రభుత్వం భారత్-అమెరికా సంబంధాలకు గుర్తింపుగా, అలాగే హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో తీసుకున్న ప్రతీకాత్మక నిర్ణయంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

భూకంపం వస్తోంది జాగ్రత్త

Updated Date - Jun 27 , 2026 | 08:05 AM