ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:37 PM
గురువులపై దాడి చేసిన గొడ్డలి పార్టీ రౌడీ బ్యాచ్ ఎక్కడున్నా వదలమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. అండమాన్‌లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
అనంతపురం, సెప్టెంబర్ 22: గురువులపై దాడి చేసిన గొడ్డలి పార్టీ రౌడీ బ్యాచ్ ఎక్కడున్నా వదలమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. అండమాన్‌లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయవాడ శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకున్న సంఘటనపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. తనపై కోపం ఉంటే తేల్చుకుందాం.. రా.. టీచర్ల జోలికొస్తే సహించేది లేదంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు.
డేట్, టైమ్ ఫిక్స్ చేయి... డీఎస్సీతోపాటు ఏపీపీఎస్సీ, కల్తీ మద్యంపై కూడా చర్చిద్దామని వారికి మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. నీతి, నిజాయితీలతో బతికిన కుటుంబం తమదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుపై ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగారా? అంటూ వైసీపీ నేతలను ఆయన నిలదీశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?! అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎంకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ చురకలంటించారు.
ఇవి కూడా చదవండి..
తిరువూరులో రూ.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telugu News