టీడీపీ నేతలపై దాడులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Oct 26 , 2026 | 08:25 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అనంతపురం జిల్లా పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అనంతపురం జిల్లా పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆదివారం అర్ధరాత్రి వరకు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి మంచం వేసుకుని ఆయన నిరసనకు దిగారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి నచ్చ చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి, కొడవాండ్లపల్లి గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగాయని పేర్కొన్నారు. మరో వైపు.. టీడీపీకి జిల్లా పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ రాప్తాడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల తీరును ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో వారిపై సదరు వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెప్పాం .. చేస్తున్నాం: బుచ్చి రాంప్రసాద్
For More AP News And Telugu News