కృష్ణలంక స్వర్గపురిలో సీబీఐ
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:21 AM
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. సాయికృష్ణను చంపేసిన తర్వాత మృతదేహాన్ని దహనం చేసిన విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురిని దర్యాప్తు బృందాలు ఆదివారం పరిశీలించాయి.
సాయికృష్ణ కేసులో మరో అడుగు
శ్మశానవాటిక సిబ్బందిని సుదీర్ఘంగా
విచారించిన దర్యాప్తు బృందాలు
నేడు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు!
విజయవాడ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. సాయికృష్ణను చంపేసిన తర్వాత మృతదేహాన్ని దహనం చేసిన విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురిని దర్యాప్తు బృందాలు ఆదివారం పరిశీలించాయి. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని ఎక్కడ భద్రపరుస్తారు? వాటి సర్వర్లు ఎక్కడుంటాయి? అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మే నుంచి జూన్ నెలాఖరు వరకు ఎన్ని శవాలను దహన సంస్కారాలకు తీసుకొచ్చారనే వివరాలు సేకరించారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న డేనియల్‌ను ప్రశ్నించారు. గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన జాబితాను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పులివెందుల సురేశ్ కుమార్, కోనేటి వెంకటరాజు ఇళ్లల్లో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం