Share News

సభ్యత్వం ఉంటేనే పదవి

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:09 AM

జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్‌ జనసేన సమన్వయకర్త షేక్‌రియాజ్‌ తెలిపాడు.

సభ్యత్వం ఉంటేనే పదవి

  • జనసేన నాయకుడు షేక్‌ రియాజ్‌

పుట్టపర్తి: జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్‌ జనసేన సమన్వయకర్త షేక్‌రియాజ్‌ తెలిపాడు. జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సభను పుట్టపర్తిలో నిర్వహించారు. సమావేశానికి షేక్‌రియాజ్‌తో పాటు అహుడా చైర్మన్‌ టీసీ వరుణ్‌, రాష్ట్రనాయకుడు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్‌, మణిప్రియ, కదిరి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చౌదరి, బ్లూమూన్‌ శివశంకర్‌, కొత్తచెరువు మార్కెట్‌యార్డు చైర్మన్‌ పూలశివప్రసాద్‌, రాప్తాడు పవన్‌ పాల్గొన్నారు.


ఈసందర్భంగా రియాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో సమన్వయకర్తలను నియమించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 26 నుంచి ఉద్యమంలా చేపట్టనున్నట్లు తెలిపారు. టీసీ వరుణ్‌ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని కోరారు. చిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు.


jsp1.jfifపత్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 14రోజులపాటు జరిగే సభ్యత్వ నమోదును విజయవంతం చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌, మండల కన్వీనర్లు అల్లాడి జయరాం, మేకల ఈశ్వర్‌, మహేశ్‌, గోరంట్ల సంతోస్‌, గూడా సోము, పూల గోవర్ధన్‌, వెంకటేషు, సురేష్‌, కమ్మల నరేష్‌, కదిరి జయశ్రీ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజమండ్రి కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 11:09 AM