Share News

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 10:15 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు
AP Assembly

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) 11వ రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలోకి చేరుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని.. అలాంటి క్రీడాకారులు ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షల్లో పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. రాత పరీక్షకు సిద్ధమయ్యేందుకు వారికి సమయం ఉండదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.


దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇస్తూ.. క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఉందని వివరించారు. డీఎస్సీ నియామకాల్లో రాత పరీక్షలతో సంబంధం లేకుండా క్రీడా నైపుణ్యాల మేరకు 426 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మిగతా నియామకాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ నిర్మాణంపై..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జెట్టీ నిర్మాణాలపై ఎమ్మెల్యేలు నడికుడితి ఈశ్వరరావు, లోకం మాధవి ప్రశ్నలు అడిగారు. దీనిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ను సాస్కి నిధులతో నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నెల్లిమర్లలో జెట్టీ నిర్మాణానికి టెండర్లు పిలిచామని మంత్రి వెల్లడించారు.


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలపై...

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సభలో ప్రశ్నలేవనెత్తారు. దీనిపై సమాధానమిచ్చిన మంత్రి టీజీ భరత్.. 2019-24 మధ్య ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు 1005 ల్యాండ్ అలాట్‌మెంట్లు ఇచ్చామని గుర్తుచేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక 751 అలాట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు డీపీఆర్ ప్రకారం రూ.1274 కోట్లతో 751 లొకేషన్లలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. దీంతో 17 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. ల్యాండ్‌కు సంబంధించి 37 కోట్ల రూపాయల రిబేటు ఇచ్చామని, అన్ని కేటగిరీల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వివరించారు.


కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు పెనాల్టీ లేకుండా సమయం పెంచామని మంత్రి అన్నారు. రూ.217 కోట్లు ఇవ్వడంతోపాటు రూ.2000 కోట్ల ఇన్‌సెంటివ్‌లు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎస్క్రో అకౌంట్ తీసుకొచ్చి, డైరెక్ట్‌గా అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశామన్నారు. మెంటరింగ్ విషయంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ప్రోత్సాహకం లభిస్తుందని వివరించారు. టెండరింగ్‌లో 4 శాతం రిజర్వేషన్ ఉందని, 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి 5000 ఎంఎస్‌ఎంఈలకు సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆహా! ఏమి రుచి..తినరా మైమరిచి

తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 11:17 AM