Share News

తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Feb 26 , 2026 | 09:22 AM

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ
Telangana IAS transfers

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో కలెక్టర్ల స్థాయిలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. టీఎస్‌జీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీ నియామకం జరిగింది.


పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్‌ను నియమించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్‌ను నియమించారు. ఎండోమెంట్స్ కమిషనర్‌గా హనుమంతరావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్‌ను నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


  • బి.విజయేంద్ర - మహబూబ్‌నగర్ కలెక్టర్ పదవి నుంచి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా నియామకం

  • అద్వైత్ కుమార్ సింగ్‌ - మహబూబాబాద్ నుంచి ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ

  • సిక్తా పట్నాయక్‌ - నారాయణపేట్ నుంచి ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ

  • సందీప్ కుమార్ ఝా - జనగాం కలెక్టర్‌గా నియామకం

  • ముష్రఫ్ అలీ ఫారూఖీ - టీఎస్‌జీపీడీసీఎల్‌ సీఎండీగా నియామకం

  • జితేష్ వి.పాటిల్ - టీఎస్‌జీపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ

  • స్నేహ శబరీష్ - మహబూబాబాద్ కలెక్టర్‌‌గా నియామకం

  • గరిమా అగర్వాల్- రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం

  • ప్రతిమ సింగ్‌ - మెదక్ కలెక్టర్‌గా పోస్టింగ్

  • అనికేత్‌ - భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం

  • చాహత్ బజ్పాయి - హనుమకొండ కలెక్టర్‌గా నియామకం

  • ఖుష్బూ గుప్తా - మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం

  • పమేలా సత్పతి - లేబర్ కమిషనర్‌గా నియామకం

  • అనురాగ్ జయంతి - యాదాద్రి కలెక్టర్‌గా బదిలీ

  • ప్రదీప్ జైన్‌ - నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం


ఇవి కూడా చదవండి...

11వ రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు..

ఆహా! ఏమి రుచి..తినరా మైమరిచి

Read Latest Telangana News And Telugu NEws

Updated Date - Feb 26 , 2026 | 10:37 AM