తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:09 AM
తిరుమలలో గురువారం నుంచి మార్చి 2 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి.
తిరుమల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం నుంచి మార్చి 2 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి విహరిస్తారు. 28న, మార్చి 1, 2 తేదీల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో విహరించనున్నారు.