Share News

ఆహా! ఏమి రుచి..తినరా మైమరిచి

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:35 AM

రంజాన్‌ మాసం వచ్చిందంటే ప్రధాన వీధుల్లో, కూడళ్లలో ఎక్కడ చూసినా వివిధ రకాల ఫలాలతో పాటు ఖర్జూర పండ్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా రంజాన్‌ మాసంలో మార్కెట్‌లో ఎక్కడ చూసిన నోరూరించే ఖర్జూర పండ్లు కన్పిస్తుంటాయి.

ఆహా! ఏమి రుచి..తినరా మైమరిచి

  • రంజాన్‌ వేళ ఉపవాస దీక్షలు

  • ప్రధాన వీధుల్లో హలీం బట్టీల సందడి

  • కులమతాలకతీతంగా ఆరగిస్తున్న జనం

  • అల్వాల్‌లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత

హైదరాబాద్: రంజాన్‌ మాసం వచ్చిందంటే ప్రధాన వీధుల్లో, కూడళ్లలో ఎక్కడ చూసినా వివిధ రకాల ఫలాలతో పాటు ఖర్జూర పండ్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా రంజాన్‌ మాసంలో మార్కెట్‌లో ఎక్కడ చూసిన నోరూరించే ఖర్జూర పండ్లు కన్పిస్తుంటాయి. హలీం(Haleem) తయారీ చేయడానికి ప్రత్యేక బట్టీలను ఏర్పాటు చేస్తారు. మటన్‌, చికెన్‌, ఫిష్‌ తదితర హలీంలను విక్రయిస్తున్నారు. మంచి రుచిని ఇవ్వడమే కాకుండా అనేక రకాల పోషక విలువలు ఉండే బలవర్ధక ఆహార పదార్థం ఈ హలీం. ప్రేమ, పవిత్ర ఆత్మీయలతో కూడిన భక్తి భావన విరజిల్లే మాసం రంజాన్‌. ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు ప్రత్యేక ఆహారం ఎంతో అవసరం. పవిత్ర ఉపవాస దీక్ష విరమణ తర్వాత సంప్రదాయ ఫలంగా ఖర్జూర పండ్లను తీసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా చెబుతారు. ఈ ఫలాలతోనే దీక్షను విరమిస్తారు.


city4.2.jpgమార్కెట్‌లో పలు రకాలు

ఎడారి ప్రాంతంలో మాత్రమే పండించే ఈ ఫలాలను రంజాన్‌ మాసం వచ్చిందంటే నగరంలోని అనేక చోట్లకు దిగుమతి అవుతుంటాయి. దేశ, విదేశాల నుంచి కూడా ఈ పండ్లను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం మర్యం, హజ్వా ఖలాస్‌, జైదీ, ముజాఫాతి, యాతి, కిమియా వంటి ఖర్జూర ఫలాలను జోరుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.


పోషకాలు ఎక్కువ

అరబ్‌ దేశాల్లో అత్యధికంగా పండించే ఖర్జూర ఫలాల్లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ఖర్జూర పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఈ ఫలాల్లో 70 శాతం చక్కెర ఉంటుంది. దీనితో పాటు పోటాషియం, మాంగనీస్‌, సల్ఫర్‌, కాల్షియం, పాస్పరస్‌, వంటి ఖనిజాలు విరివిగా ఉంటాయని శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. ఇవే కాకుండా విటమిన్‌ ఎ, బి-కాంప్లెక్స్‌, విటమిన్లు, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. 100 గ్రాముల ఖర్జూర పండ్లు తింటే 350 కిలో క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. అందుకే ఉపవాస దీక్ష సమయంలో ప్రత్యేకంగా ఈ పండ్లను తినడం వల్ల ముస్లీంలకు ఇఫ్తార్‌ సమయంలో అలసట దరిచేరకుండా ఉంటుంది.


city4.3.jpgహలీం ప్రత్యేకత

రంజాన్‌ మాసంలో ఎక్కువగా లభించేది ఖర్జూర ఫలాల తర్వాత హలీమే.. చికెన్‌, మేక మాంసంతో హలీంను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం ముస్లింలు ఉపవాస దీక్షను విరమించిన తర్వాత హలీం ఆరగిస్తారు. అయితే ముస్లింలే కాకుండా మతాలకతీతంగా అందరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. చికెన్‌తో తయారు చేసిన హలీం, చేపతో తయారు చేసిన హలీంను కూడా జోరుగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అనేక రకాల పోషక విలువలు కలిగిన మసాలాలతో పాటు నెయ్యి వేసి రూచిగా తయారు చేస్తారు.


ఎక్కువగా ఇష్టపడుతా..

రంజాన్‌ మాసం వచ్చిదంటే హలీం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతా. ముఖ్యంగా చికెన్‌, మేక మాంసంతో తయారు చేసిన హలీం రుచిగా ఉంటుంది. బట్టీల వద్ద మతాలకతీతంగా అందరూ హలీం ఎక్కువగా తింటారు.

- శ్రీనివాస్‏రెడ్డి, అల్వాల్‌ చికెన్‌షా్‌ప ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


ఈ వార్తలు కూడా చదవండి:

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

పింఛను పెంపు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 08:35 AM