బొమ్మ ఫోన్‌తో చిన్నారి ఆనందం.. మాటల్లో చెప్పలేం... వీడియో వైరల్
ABN , Publish Date - Feb 26 , 2026 | 07:20 AM
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ చిన్నారి, బొమ్మ ఫోన్‌తో వీడియో షూట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ చిన్నారి బొమ్మ ఫోన్‌తో వీడియో షూట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా డప్పులు వాయిస్తూ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక చిన్నారి తన బొమ్మ ఫోన్‌తో ఆ దృశ్యాలను వీడియో తీసింది. తన బొమ్మ ఫోన్‌లో అంతా రికార్డ్ అవుతుందని ఎంతో సంతోషపడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో @Chai_Angelic అనే యూజర్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘భవిష్యత్తులో ఆలయ ఆచారాలను ప్రత్యక్షంగా కవర్ చేసే వ్లాగర్' అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘అమాయకత్వం చిరస్మరణీయ క్షణాలను అందిస్తుంది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్
పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం