వైసీపీ నేతల ఖాతాలోకి భారీగా నగదు.. పోలీసుల దర్యాప్తు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:35 PM
వైసీపీ నేతల బ్యాంక్ ఖాతాల్లోకి విదేశీ కరెన్సీ నగదు భారీగా జమ అయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. దీంతో ఆ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు.
పుట్టపర్తి, అక్టోబర్14: వైసీపీ నేతల బ్యాంక్ ఖాతాల్లోకి విదేశీ కరెన్సీ నగదు భారీగా జమ అయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. దీంతో ఆ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ ఘటన కదిరి నియోజకవర్గంలో తలుపుల మండలంలో చోటు చేసుకుంది. తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డితో పాటు మరో నలుగురు బ్యాంక్ ఖాతాల్లోకి దాదాపు రూ.4 కోట్ల నగదు జమ అయింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి యూనియన్ బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయాలని అధికారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో మండల వైసీపీ నేత డిక్కీ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ పేరుతో ఇప్పటికే పలువురిని డిక్కీ బాబు మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో అతడి ఖాతాలను గతంలోనే బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ చేశారు.
అయితే ఫ్రీజ్ చేసిన డిక్కీబాబు ఖాతాలోకి కోట్లాది రూపాయిలు జమ కావడంతో.. ఈ అంశంలో బ్యాంక్ అధికారుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత డిక్కీ బాబుతో పాటు అతడి ఇద్దరు బంధువులు.. మరో ఇద్దరు బినామీ ఖాతాల్లో దాదాపు రూ. 4 కోట్ల జమ అయినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్లో కలకలం
Read Latest AP News And Telugu News