అనకాపల్లి జిల్లాలో రూ.1.33 కోట్ల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Oct 19 , 2026 | 07:25 PM
అనకాపల్లి జిల్లాలో రూ. కోటి విలువ చేసే గంజాయి లభ్యమవడం కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అనకాపల్లి, అక్టోబర్ 19: జిల్లాలోని నర్సీపట్నం మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి దాదాపు రూ. 1.33 కోట్ల విలువ చేసేదిగా గుర్తించారు.
డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం మండలంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. మండలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మండలంలోని గబ్బాడ వద్ద గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక కారు, రెండు బైకులు, ఐదు సెల్ ఫోన్లు, రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈ గంజాయిని తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దందాలో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం.. చరిత్రాత్మక విజయమన్న మంత్రి మండిపల్లి
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్
Read Latest AP News And Telugu News