Share News

ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న 110 ఏళ్ల వృద్ధురాలు.. అభినందించిన సీఎం

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:32 PM

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ శతాధిక వృద్ధురాలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా అభినందించారు.

ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న 110 ఏళ్ల వృద్ధురాలు.. అభినందించిన సీఎం
110 year old votes in election

కాకినాడ, నవంబరు 29: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిందో శతాధిక వృద్ధురాలు. జిల్లాలోని పిఠాపురం మండలం కుమారపురంలో 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ వృద్ధురాలిని అభినందించారు. 110 ఏళ్ల వయసులోనూ ఓటువేసి.. నేటి తరానికి ఓటు విలువను చాటి చెప్పారంటూ ప్రశంసలు కురిపించారు. శతాధిక వయసులోనూ కష్టమనుకోకుండా.. వృద్ధురాలు ఓటుహక్కు వినియోగించుకోవడం.. ఆమె నిబద్ధత, బాధ్యతకు నిదర్శనమని సీఎం కొనియాడారు.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 03:57 PM