తెలంగాణ మద్యం టెండర్ల పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ABN, Publish Date - Oct 25 , 2025 | 01:43 PM
మద్యం టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు ఏఏజీ ఇస్తామని కోర్టుకు తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని కోర్టు పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ మద్యం టెండర్ల అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టెండర్ల గడువు ఏ నిబంధన ప్రకారం పొడిగించారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. వాదనలో భాగంగా టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు ఇస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని కోర్టు పేర్కొంది. తుది తీర్పునకు లోబడే మద్యం దుకాణాల లైసెన్స్ కేటాయించాలని ఆదేశించింది. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేసిన ఐదుగురు వ్యాపారులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Updated at - Oct 25 , 2025 | 01:44 PM