Home Minister Anitha: హోం మంత్రి అనితను అడ్డుకున్న మత్స్యకారులు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 07:10 PM
తాను వస్తున్నానని తెలిసి బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చారని హోం మంత్రి అనిత తెలిపారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి: తనని రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారని హోం మంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే వస్తానని చెప్పి, ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చానని పేర్కొన్నారు. కానీ.. గ్రామస్తులు ధర్నాకు దిగడం ఆవేదన కలిగిస్తోందన్నారు. తాను వస్తున్నానని తెలిసి బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చారన్నారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోట అని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు తాను ఎప్పుడు న్యాయమే చేస్తానని చెప్పుకొచ్చారు. సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. గ్రామస్తులు అందరు దయచేసి మాట వినాలని ఆమె కోరారు. ఎవరూ ఆకలితో ఉండకూడదు.. అనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
Updated at - Sep 29 , 2025 | 07:10 PM