Share News

Justice Sudarshan Reddy: రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవారే ఉపరాష్ట్రపతిగా ఉండాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 07:54 PM

ఉపరాష్ట్రపతి పదవి అధికారం కాదు..అది గౌరవ ప్రదమైన రాజ్యాంగ పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి పదవికి తాను సరైన వాడినని... అర్హులైన వారిని నిర్ణయించుకొని ఓటేయాలని ఎంపీలను సుదర్శన్ రెడ్డి కోరారు.

 Justice Sudarshan Reddy: రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవారే ఉపరాష్ట్రపతిగా ఉండాలి
Justice Sudarshan Reddy

ఢిల్లీ, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి పదవి (Vice President Post) అధికారం కాదు.. అది గౌరవ ప్రదమైన రాజ్యాంగ పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి పదవికి తాను సరైన వాడినని...అర్హులైన వారిని నిర్ణయించుకొని ఓటేయాలని ఎంపీలను కోరారు. ఇవాళ(బుధవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన స్థానమే ఉపరాష్ట్రపతి పదవి అని నొక్కిచెప్పారు. దాదాపు 55 ఏళ్లు రాజ్యాంగంతో సుదీర్ఘమైన ప్రస్తానం చేసిన తనకన్నా ఈ పదవికి అర్హులైన వారెవరు ఉంటారని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి.


రాజ్యాంగాన్ని అన్వయించడం, అనునిత్యం నిత్య విద్యార్థిగా ఔపాసన పట్టిన వాడినని...దానికి కొనసాగింపే ఉపరాష్ట్రపతి పదవి...అందుకే ఈ పదవికి పోటీ చేయడానికి అంగీకరించానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం పట్ల అవగాహన గల వ్యక్తి కావాలనుకొని తనను ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టాలని భావించారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవి అత్యున్నత రాజ్యాంగ పదవి అని ఎన్నుకోవాల్సింది ఎంపీలే కాబట్టి అర్హులైన వారిని ఎన్నుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల పట్ల సమాన దృక్ఫధం కలిగి సభను సజావుగా నడపాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని వారు విజ్ఞులు, దూరదృష్టి గలవారని తెలిపారు. సమాజం పట్ల పూర్తి అవగాహన గల వారు... వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 08:22 PM