Share News

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:32 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నళినిని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్.

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..
Collector Hanumantha Rao Meets Nalini

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు డీఎస్పీ నళిని(Nalini)ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Yadadri Bhuvanagiri District Collector Hanumantha Rao) ఇవాళ (సోమవారం) కలిశారు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్. సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సందేశాన్ని నళినికి తెలిపారు కలెక్టర్ హనుమంతరావు.


నాకు రావాల్సింది ఇవ్వాలి: నళిని

నళినిని కలెక్టర్ కలవడానికి ముందు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆశ కల్పించారు. నా 16 పేజీల లేఖను చెత్తబుట్టలో వేశారు. తెలంగాణ డీజీపీని సీఎం రేవంత్‌రెడ్డి కలవమన్నారని చెబితే.. నేను వెళ్లి కలిశాను. నాకు రావాల్సింది ఇవ్వమన్నాను.. కానీ భిక్ష అడగలేదు. 2011లో ప్రజల గురించి ఆలోచించి జై తెలంగాణ అని ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేశారు. నాకు రావాల్సింది ఇవ్వడానికి ఇన్నేళ్లుగా నేను ఎదురుచూడాల్సి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు నళిని.


మరణ వాగ్మూలం అంటూ నళిని ప్రకటన..

అయితే, నళిని గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో నిన్న(ఆదివారం) తన మరణ వాగ్మూలం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డిని తాను గతంలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో తాను పోరాడిన విధానం గురించి ఆమె తెలిపారు. తనకు రావాల్సింది ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు నళిని.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే

సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 07:55 PM