Prabhakar Rao Bail Cancellation: ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:28 PM
ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ముందస్తు బెయిల్ రద్దుపై ఈరోజు (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగగా.. తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం అక్టోబర్ 8కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహత్, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు ఇవే..
అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్‌లో ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌లో తేదీలతో సహా ఉందని.. మొత్తం డేటాను రీసెట్ చేశారన్నారు. జడ్జీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ ఫోన్లు ట్యాపింగ్ చేశారని కోర్టుకు తెలియజేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ కేసు నమోదు చేయలేదన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుందని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభాకర్ రావు తరపు న్యాయవాది వాదనలు
ప్రభాకర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును 15 సార్లు సిట్ విచారించిందని కోర్టుకు తెలియజేశారు. ఎమ్మెల్యేను, ఎంపీలను ముందు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇతనేనా అని అడుగుతున్నారని న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 8వ తేదీ లోపు రిజెండర్ ఫైల్ చేయాలని ప్రభాకర్ రావు తరపు న్యాయవాదిని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News