Srisailam: నేటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:34 AM
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
శ్రీశైలం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, కంకణపూజ, కంకణధారణ తదితర పూజలు నిర్వహించనున్నారు. భ్రమరాంబికాదేవి అమ్మవారు సోమవారం శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు.